పల్నాటి ప్రజల ప్రియతమ నేత కామ్రేడ్ చల్లా బరిసె కోటయ్య సంస్మరణ సభను జయప్రదం చేయాలని పిడిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు వై.వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం కామ్రేడ్ బరిసె కోటయ్య సంస్మరణ సభ కరపత్రాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నరసరావుపేట బస్టాండ్ సెంటర్లో ఆవిష్కరించారు. కామ్రేడ్ బరిసె కోటయ్య నాలుగు దశాబ్దాలుగా పీడిత ప్రజల పక్షాన అడిగొప్పల గ్రామ భూస్వామ్య, అగ్రవర్ణం పెత్తందారులకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం విప్లవోద్యమంలో పనిచేశారన్నారు.