ఉప రాష్ట్రపతితో పల్నాడు ఎంపీ లావు కృష్ణదేవరాయలు భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలపై ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో, రాష్ట్ర అభివృద్ధి పనులపై చర్చ జరిగింది. ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రానికి సంబంధించిన మార్గనిర్దేశానికి ధన్కర్ ఇచ్చిన సూచనలు రాష్ట్ర ప్రగతి పదానికి మద్దతుగా ఉంటాయని తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.