నరసరావుపేట: అశ్వకుల్లా ఖాన్ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి
నరసరావుపేట పట్టణంలోని అశ్వకుల్లా ఖాన్ కాలనీలో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని పిడిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం అశ్వకుల్లా ఖాన్ కాలనీని పిడిఎం నాయకులు సందర్శించారు. ఈ కాలనీలో 40 నిరుపేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, కాలనీపై ప్రభుత్వం దృష్టి పెట్టి కనీస మౌలిక వసతులు కల్పించాలన్నారు.