స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒంగోలు నగరంలోని జిల్లా కలెక్టర్ బంగ్లాలో గురువారం రాత్రి ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఎట్ హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు జిల్లా జడ్జిలు, ప్రకాశం జిల్లా శాసనసభ్యులు, అధికారులు, వివిధ పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.