పర్చూరు పరిసర ప్రాంతాల్లో మరోసారి ఉల్లి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. నిన్న మొన్నటి వరకూ కిలో ఇరవై నుంచి ముప్పయి రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు యాభై రూపాయలకు చేరుకుంది. మరి కొద్ది రోజులు ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లి వినియోగం ఎక్కువగా ఉండటంతో డిమాండ్ కూడా అధికంగానే ఉంటోంది. ధరలు పెరగటానికి ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గడమే కారణమని వ్యాపారస్తులు చెబుతున్నారు.