పెదకూరపాడు మండలంలోని 75తాళ్లూరు జడ్పీ హైస్కూల్లో శనివారం గుడ్ షెఫర్డ్ స్వచ్ఛంద సంస్థ అమరావతి వారిచే బాలికలకు కౌమారదశ, జీవన నైపుణ్యాల మీద అవగాహన కల్పించారు. జీవితంలో సమస్యలను అధిగమించడానికి, అనుకున్న లక్ష్యాలను సాధించడానికి జీవన నైపుణ్యాలు ఎంతో అవసరమని, వాటిని ఆర్. పి తిరుపతి రావు వివరించారు. దీనిలో గుడ్ షెఫర్డ్ సంస్థ సిస్టర్ వినరసి, పాఠశాల హెచ్. ఎం ఎ. శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.