అచ్చంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వీరభద్ర కాలనీ వాసుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ లు సందర్శించారు. ఆదివారం పునరావాస కేంద్రాన్ని సందర్శించి, 53 కుటుంబాలకు చెందిన 120 మందికి ఏర్పాటు చేసిన భోజనం వడ్డించారు.