పెదకూరపాడు మండలంలో గురువారం సాయంత్రం ఓ మోస్తారు వర్షం కురిసింది. ఉదయం, మధ్యాహ్నం ఉష్ణోగ్రత అధికంగా ఉండి సాయంకాలానికి ఆకాశం మబ్బులు కమ్మి భారీ వర్షం కురిసిందని మండల ప్రజలు తెలిపారు. వారం రోజులుగా వర్షం లేకపోవడంతో పత్తి చేలన్ని ఊపిరి పీల్చుకున్నాయని రైతులు తెలిపారు. కురిసిన వర్షం వల్ల చేలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రైతులు తెలిపారు.