దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం పొన్నూరు మండలం ఆరెమండ గ్రామంలోని వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టుతున్నామని వర్షం పడితే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళనలు చెందుతున్నారు. ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయటం లేదని ఆరోపించారు. ధాన్యం వ్యాపారులకు తెగ నమ్ముకోవాల్సి వస్తుందని తెలిపారు.