పెదకాకాని మండలం ఉప్పాలపాడు గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అధికారాలకు పంట పడించిన రైతు దగ్గర గిట్టుబాటు ధర వచ్చే విధంగా కొనుగోలు చేయాలని సూచించారు. ధాన్యం విక్రయించిన రైతుకు కొనుగోలు కూపన్ ను ఎమ్మెల్యే ధూళిపాళ్ల అందించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులతో పాటు కూటమి శ్రేణులు పాల్గొన్నారు.