భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర ఎఐటియుసి పిలుపుమేరకు రేపు సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పొన్నూరు నియోజకవర్గo ఏఐటీయూసీ కార్యదర్శి ఆరేటి రామారావు పిలుపునిచ్చారు. ఆదివారం సిపిఐ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఇసుక రీచ్ లను ప్రభుత్వమే నిర్వహించి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పునరుద్దించి ఆదుకోవాలన్నారు.