గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామ పరిధిలో నేషనల్ హైవే నుంచి నంబూరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి ఇటీవల వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. గ్రామస్తులు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా సోమవారం ఆయన గ్రామాన్ని సందర్శించారు. పాడైపోయిన రోడ్లను త్వరలో మరమ్మత్తులు చేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయన వెంట కూటమి శ్రేణులు పాల్గొన్నారు.