పొన్నూరు మండలంలోని ములుకుదురు గ్రామంలో శుక్రవారం గ్రామ ఆర్బికే కేంద్రంలో సమగ్ర పోషకాల యాజమాన్యం పై రైతులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ ఎం వెంకట్ రాములు పాల్గొని వరిలో నత్రజని భాస్వరం పొటాష్ ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు ఉండవచ్చని పొన్నూరు ఏడిఏ రామకోటేశ్వరి రైతులకు వివరించారు.