ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు మండలంలో మండల పరిషత్ సచివాలయ సిబ్బందితో గురువారం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలని కార్యనిర్వహణలో అలసత్వం వీడాలని ప్రజలకు సేవ మార్గంలోనే పనిచేయాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల పార్టీ అధ్యక్షులు, కూటమి నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.