కాకుమాను మండలం బోడిపాలెం, అప్పాపురం గ్రామాలలో గురువారం పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె కిరణ్మయి పాల్గొని మాట్లాడుతూ వాతావరణం అనుకూలంగా లేదని రైతులు అప్రమత్తంగా ఉండాలని వరి కోతలను త్వరితగిన చేసుకోవాలని కోసిన ధాన్యాన్ని జాగ్రత్తగా నిలువ చేసుకోవాలని సూచించారు. రైతు సేవా కేంద్రాలలో ప్రభుత్వ మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.