ప్రత్తిపాడు: రైతులందరికి సాగునీరు అందిస్తాం

52చూసినవారు
ప్రత్తిపాడు మండలం మల్లాయపాలెం మేజర్ కాలువ పూడికతీత పనులను శుక్రవారం నీటి సంఘ ఛైర్మన్ కల్లూరి కుసుమ ప్రారంభించారు. రైతులకు సకాలంలో సాగునీరు అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రూ.40 లక్షలతో పనులు చేపడుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘాల అధ్యక్షులు రైతులు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్