ప్రత్తిపాడు మండలం వంకాయలపాడు మేజర్ మల్లయపాలెం మేజర్ కాల్వ పూడిక తీత పనులను డి. సి చైర్మన్ ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని నియోజకవర్గంలో కాల్వల పూడికతీత ద్వారా రైతాంగానికి పంటలు ఎండిపోకుండా చివర భూముల వరకు నీరు సరఫరా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.