పెదనందిపాడు మండలంలో ఆదివారం పత్తిపాడు నుండి పెదనందిపాడు వైపు వెళ్లే మార్గంలో ఓ వ్యక్తి మద్యం సేవించి వాహనం నడపటం వలన వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. వాహనదారుడుకి తీవ్ర గాయాలవ్వగా స్థానికులు 108 వాహనంలో ప్రతిపాడు ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుడి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.