గుంటూరు జిల్లా, ప్రతిపాడు నియోజకవర్గo తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని కాకుమాను మండలంలోని కొమ్మూరు గ్రామంలో గురువారం అసైన్మెంట్ భూములను తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ అధికారులతో కలిసి పరిశీలించారు. మండల పరిధిలోని 21 రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. కాకుమాను తహసిల్దార్ బి.వెంకటస్వామి, సబ్ రిజిస్టర్ వి నీరజ, సర్వేయర్ బి శ్రీనివాసరావు గ్రామ రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు.