పురుగు మందుల దుకాణాలు తనిఖీ

84చూసినవారు
పురుగు మందుల దుకాణాలు తనిఖీ
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు, పురుగు మందులు అమ్మాలని రేపల్లె వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు విజయబాబు అన్నారు. సోమవారం రేపల్లె పట్టణంలోని ఎరువులు, పురుగుమందుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ ఎరువులను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు షాపు లైసెన్సును రద్దు చేస్తామన్నారు ఎరువుల దుకాణం ముందు సూచిక బోర్డును ఏర్పాటు చేసి స్టాక్ వివరాలను బోర్డుపై ఉంచాలన్నారు.

సంబంధిత పోస్ట్