రేపల్లెలో భారీ వర్షం

5141చూసినవారు
రేపల్లె పట్టణంలో సోమవారం భారీ వర్షం కురిసింది. వర్షానికి రేపల్లె పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ నీట మునిగాయి. భారీ వర్షం కురవడంతో డ్రైనేజీలు పొంగి పొర్లాయి. కాలవలోని మురుగు నీరు రహదారుల పైకి చేరటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అకాల వర్షాలు కారణంగా చిరు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షం కురవడంతో ప్రజలు ఇళ్ళకే పరిమితమయ్యారు.

సంబంధిత పోస్ట్