నగరం మండలంలోని ఉల్లిపాలెం సబ్ స్టేషన్ పరిధిలోని సజ్జావారి పాలెం ఫీడర్ మరమ్మత్తుల నిమిత్తం ఈనెల 17వ తేదీ శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు. ఉదయం 8: 30 నుండి మధ్యాహ్నం 1: 00 వరకు సజ్జావారి పాలెం మరియు ఉల్లిపాలెం గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు, వ్యాపారస్తులు విద్యుత్ అసౌకర్యాన్ని గమనించి సహకరించాలని కోరారు.