రేపల్లె: ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

60చూసినవారు
ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షుడు రోశయ్య కోరారు. మంగళవారం రేపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 16వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఉద్యోగులకు ఐఆర్, డిఏ మరియు పాత బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్