రైతులు వరిపంట ప్రాథమిక దశలోనే ఎలుకలను నివారించనట్లయితే పంట దిగుబడి పై ప్రభావం చూపిస్తుందని అద్దంకి సహాయ వ్యవసాయ సంచాలకులు కే ధనుంజయ్ అన్నారు. బుధవారం చెరుకుపల్లి మండలం కావూరు, ఆరుంభాక గ్రామాల్లో పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరూ సామూహిక ఎలుకల నివారణ చేపట్టినప్పుడే ఎలుకలు సమూలంగా కనుమరుగవుతా యన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టీ బాలాజీ, గంగాధర్ పాల్గొన్నారు.