నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరు, అమ్మనబ్రోలు తదితర గ్రామాలలోని రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు. నాగులుప్పలపాడు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ముమ్మరంగా లోతు దుక్కి దున్నుకుంటున్నారు. ఇప్పటికీ రెండు మూడు సార్లు దుక్కులుదున్నుకున్నామని వర్షాలపైనే ఖరీఫ్ సాగు పూర్తిగా ఆధారపడి ఉందని రైతులు అంటున్నారు. పంటలు సాగుకై వర్షాల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నామని అంటున్నారు.