మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై మహేశ్ ఆధ్వర్యంలో నైట్ బీట్ పోలీసింగ్ కార్యక్రమాన్ని గురువారం రాత్రి నిర్వహించారు. పట్టణంలోని బస్టాండు కూడలి, ప్రధాన సెంటర్ లో వాహనాల తనిఖీ చేశారు. అనుమానస్పద వ్యక్తులను గుర్తించి వారి వివరాలను ఎస్సై ఆరా తీశారు. మండలంలో దొంగతనాల నివారణకు నైట్ బీట్ పోలీసింగ్ నిర్వహిస్తున్నామని, అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ఎస్సై పేర్కొన్నారు.