నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో జానకిరామయ్యకు చెందిన సుమారు 10 ఎకరాల గడ్డి వామి బుధవారం రాత్రి దగ్ధమైంది. గడ్డి వామి దగ్ధమవుతుండగా చూసిన ఓ మహిళ జానకి రామయ్యకు సమాచారం అందించటంతో ఆయన వెళ్లి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కానీ అప్పటికే వామి పూర్తి భాగం దగ్ధమైపోయింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.