రాజుపాలెం మండలం ఇనిమెట్లలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. వేడుకల అనంతరం ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన వాగ్దానం మేరకు గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం మండలంలోని పలు పాఠశాలల్లో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు.