ముప్పాళ్ల మండలంలోని దమ్మలపాడులో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ తిరుణాల మహోత్సవంలో గురువారం సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుణాల మహోత్సవానికి విచ్చేసిన ఆయనకు గ్రామస్థులు తెలుగుదేశం పార్టీ నాయకులు స్వాగతం పలికారు. ఆలయ నిర్వహకులు ఆయనకు స్వామివారి వస్త్రాలు సమర్పించారు.