ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామంలో రైతు మిత్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కబడ్డీ పోటీలలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ప్రతి ఏడాది కమిటీ సభ్యులు నిర్వహించటం అభినందనీయమన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలతో, ఆర్థిక భారమైన లెక్క చేయకుండా పోటీలు ఘనంగా నిర్వహించి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నారని ఇటువంటి క్రీడలతో ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారన్నారు.