తుళ్ళూరు మండలంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న మొబైల్ ఆధార్ క్యాంప్ సద్వినియోగం చేసుకోవాలని తుళ్ళూరు ఎంపీడీవో శిల్ప కానూరి తెలిపారు. మంగళవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 26వ తేదీన తుళ్ళూరు, పెదపరిమి, మందడం, 27వ తేదీన తుళ్ళూరు, పెదపరిమి, వెలగపూడి 28వ తేదీన అనంతవరం, మల్కాపురం, తుళ్ళూరు గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.