తుళ్లూరు మండలంలోని అన్ని గ్రామాల్లో ఈనెల 20 నుంచి ఈనెల 31వ తేదీ వరకు ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు పశువైద్యాధికారి మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పెద్ద పశువులు, గొర్రెలకు నట్టల నివారణ మందులు, టీకాలు వేస్తారన్నారు. వ్యాధులకు చికిత్సలు అన్నీ ఉచితంగా పశు సంవర్ధక శాఖ సిబ్బందితో నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.