మహిళల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. బుధవారం సాయంత్రం ఆమె వెలగపూడి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గడచిన 4 నెలల్లో ఎటువంటి సంఘటనల్లో నైనా 48 గంటల్లో నిందితులను అరెస్టు చేశామన్నారు. నిందితులకు త్వరగా శిక్ష పడాలని ఉద్దేశంతో స్పెషల్ కోర్టు కోసం హైకోర్టుకు ప్రతిపాదనలు పంపామన్నారు.