తుళ్లూరు మండల పరిధిలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో సోమవారం కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగింది. దీంతో రాయపూడి పెద్దలంకలో నివాసం ఉంటున్న సుమారు 200 కుటుంబాలను కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని పునరావాస కేంద్రానికి తరలించారు. ఇళ్ల వద్ద ఎవరూ లేకపోవడంతో పశువులకు ఆలనా పాలన లేకుండా పోయింది. కృష్ణా నది ఉధృతి పెరగడంతో సుమారు 200 గేదెలు నదిలో కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.