తెనాలి - గుంటూరు మార్గంలో అదనపు బస్సుల ఏర్పాటు

72చూసినవారు
తెనాలి - గుంటూరు మార్గంలో అదనపు బస్సుల ఏర్పాటు
తెనాలి-గుంటూరు మార్గంలో ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో బస్సులు కిక్కిరిసి పోతున్నాయి. దీంతో విద్యార్ధులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ఆయా సమయాల కోసం నాలుగు అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఈ మార్గంలో 30 బస్సులు నడుస్తున్నాయని, వాటిని 34కు పెంచినట్లు తెనాలి డిపో మేనేజర్ రాజశేఖర్ గురువారం తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్