తెనాలి: జియో ట్యాగ్ మ్యాపింగ్ సర్వేకి ప్రజలు సహకరించాలి

66చూసినవారు
తెనాలి: జియో ట్యాగ్ మ్యాపింగ్ సర్వేకి ప్రజలు సహకరించాలి
తెనాలి మండల పరిధిలో జరుగుతున్న హౌస్ హోల్డ్ జియో ట్యాగ్ మ్యాపింగ్ సర్వేకి ఇంటి వద్దకు వచ్చిన సచివాలయ కార్యదర్శికి ప్రజలు తగిన సమాచారం ఇచ్చి సహకరించాలని ఎంపీడీవో అత్తోట దీప్తి మంగళవారం కోరారు. ఈ సర్వేకు ప్రతి ఇంటిలోని కుటుంబ సభ్యులు బ్యాంక్ అకౌంట్లు లేనివారు స్థానిక పోస్ట్ ఆఫీస్ లో రూ. 200లతో అకౌంట్ ఓపెన్ చేసి కార్యదర్సులకు వివరాలు అందజేయవచ్చని అన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్