కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా మండలంలోని లోతట్టు ప్రాంతాలైన లంక గ్రామాలను బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న లంక గ్రామ ప్రజలతో మాట్లాడుతూ ఈ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మండలాధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు కావలసిన ఏర్పాట్లను చూస్తారన్నారు. ఈ పర్యటనలో రేపల్లె ఆర్డీవో, మండల అధికారులు ఉన్నారు.