బొల్లాపల్లి మండలంలో మంగళవారం ప్రేమ జంట సాగర్ కెనాల్ లో దూకడం సంచలనంగా మారింది. స్థానికుల వివరాల ప్రకారం మండలంలోని వెల్లటూరు గ్రామ సమీపంలో గల సాగర్ కెనాల్లో మంగళవారం ఓ జంట దూకారు. గమనించిన స్థానికులు వెంటనే కాలువలో దూకి వారి కోసం రక్షించే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, యువతిని రక్షించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.