సూర్య ఘర్ పథకంలో భాగంగా సోలార్ సిస్టంను ఇంటిపైన బిగించుకుంటే ఉత్పన్నమయ్యే విద్యుత్‌ను సొంత అవసరాలకు వినియోగించుకోవచ్చు, అదనంగా ఉన్న విద్యుత్‌ను ప్రభుత్వానికి అమ్మి ఆర్థిక భారం పడకుండా లాభపడవచ్చని నరసరావుపేట విద్యుత్ శాఖ డీఈ రాoబొట్లు శుక్రవారం చెప్పారు. ఈపూరు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాలలో 38 బృందాలతో విద్యుత్ మీటర్ల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.