ఆర్థిక కష్టాల్లోనూ ప్రజలకు సానుకూల నమ్మకం కలిగించేలా రాష్ట్ర బడ్జెట్ కూర్పు ఉందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. సంక్షోభంలో కూడా అవకాశాలను వెతకడం సీఎం చంద్రబాబుకు కొత్తేమి కాదని ప్రస్తుత బడ్జెట్ ద్వారా మరోసారి నిరూపించారన్నారు. సోమవారం ఆర్థిక మంత్రి పయ్యావల కేశవ్, మంత్రి అచ్చం నాయుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రంగాలకు ప్రాధాన్యత కల్పిస్తూ జనరంజకంగా ఉందని ఎమ్మెల్యే జీవి పేర్కొన్నారు.