2025లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 6 లోపు అర్హత గల పట్టబద్రులందరూ ఓటును త్వరగా నమోదు చేసుకోవాలని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. వినుకొండలోని ఆయన కార్యాలయంలో ఆదివారం మాట్లాడుతూ ఇంకా 3 రోజులు మాత్రమే సమయమున్నదని అన్నారు. పట్టభద్రులకు సూచనలు ఇచ్చేందుకు తమ కార్యాలయ సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీ చేస్తున్నట్లు తెలిపారు.