పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను నిర్దేశించిన సమయంలో పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టేందుకు వెనుకాడబోమని సీఎం నారా చంద్రబాబు హెచ్చరించారు. గురువారం పోలవరం నిర్మాణ పనుల పరిశీలిన అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లతో సీఎం సమీక్ష నిర్వహించారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి పనులు పూర్తి చేయడంలో కాంట్రాక్టర్లు అలసత్వం వహించవద్దన్నారు. 2027 పుష్కరాలకు ముందుగానే పనులు పూర్తిచేయాలన్నారు.