ఉమ్మడి కడప జిల్లాలోని 50 మంది వైసీపీ జడ్పీటీసీలు రాజీనామాలు చేసి ఎన్నికలకు రావాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. కడప జడ్పీ చైర్మన్ దక్కించుకున్నామంటూ వైసీపీ నేతలు కేకులు కోసుకోవడం, దండలు వేసుకుని హడావిడి చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఏపీలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 92 స్ట్రైక్ రేట్‌తో అన్ని స్థానాల్లో కూటమి ప్రభుత్వం పోటీ చేసి గెలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.