ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గురువారం దిన్నెదేవరపాడులోని సాక్షి కార్యాలయం ఎదుట బ్రాయిలర్ కోళ్లతో నిరసన వ్యక్తం చేశారు. చికెన్ అమ్మకాలపై కమీషన్ తీసుకుంటున్నట్లు సాక్షి పత్రికలో తనపై తప్పుడు కథనాలు ప్రచురించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాధార ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు చికెన్ సెంటర్ల నుంచి కేజీకి రూ.10 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆమె ఆరోపించారు.