జీవిత భాగస్వామి ఇద్దరిలో ఎవరైనా సరే బలవన్మరణానికి పాల్పడతానని బెదిరించించిన, ప్రయత్నం చేసిన విడాకులు తీసుకోవచ్చని బాంబే హైకోర్టు తీర్పు వెల్లడించింది. హిందూ వివాహ చట్టం, 1995లోని సెక్షన్ 13(1)(ia) ప్రకారం విడాకులు మంజూరు చేయచ్చని తెలిపింది. భార్య ఆత్మహత్య చేసుకుంటానని, జైలుకు పంపిస్తానని బెదిరిస్తోందని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించగా.. బాంబే హైకోర్టులో ఊరట దక్కింది.