విద్యా, వ్యాపారం చేయాలనుకునే విదేశీయులకు భారత్ రావాలనుకుంటే కేంద్రం ఆహ్వానిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు. దేశ అభివృద్ధికి సహకరించే వారికి తాము ఎప్పుడు సహకరిస్తామని చెప్పారు. అలా కాకుండా దురాలోచనతో దేశానికి వచ్చి హాని కలిగించాలని చూసే వారిని క్షమించమని, కఠిన శిక్షలు ఉంటాయని వెల్లడించారు. అలాంటి వారికి భారత్ ధర్మశాల కాదంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.