దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారం కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గురించి ప్రధానికి మంత్రి సత్యకుమార్ వివరించారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన సోము వీర్రాజు కూడా ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు.