AP: మంత్రి నారా లోకేష్‌కు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కృతజ్ఞతలు తెలిపారు. సొంత ఖర్చుతో విమానం, గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన లోకేష్ ఎందరికో స్ఫూర్తి అని స్పీకర్ అయ్యన్న పేర్కొన్నారు. లోకేష్ సకాలంలో స్పందించి మహిళ గుండెను తరలించిడంలో సహాయం చేసినందుకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు గుంటూరు నుంచి తిరుపతికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఓ మహిళ గుండెను తరలించిన సంగతి తెలిసిందే.