ట్రైనీ డాక్టర్ ఘటన.. నిందితుడి మరణశిక్షపై రేపు సుప్రీంలో విచారణ

57చూసినవారు
ట్రైనీ డాక్టర్ ఘటన.. నిందితుడి మరణశిక్షపై రేపు సుప్రీంలో విచారణ
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కి కోర్టు రూ.50,000 జరిమానాతో పాటు జీవితఖైదు విధించింది. అయితే ఈ తీర్పుపై వ్యతిరేకత వ్యక్తమైంది. నిందితుడికి మరణశిక్ష విధించాలని బెంగాల్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. అయితే నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ పెరగడంతో సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. దీంతో ఈ కేసును బుధవారం విచారించనుంది.

సంబంధిత పోస్ట్