తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని ఇటీవల సీఎం రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఓ ప్రచారం ఊపందుకుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇక మార్చిలో టెన్త్, ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. దీంతో ఏప్రిల్ లేదా మే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగొచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.